Sneha TV
తెలంగాణ

మండల్ పరిషత్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం

మండల్ పరిషత్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరం
X

ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 01 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం, ముత్తూట్ ఫైనాన్స్ వారి సౌజన్యంతో గాంధీ ఆస్పత్రి వారు బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిభిరంలో పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సైతం రక్తదానం చేసి ఆపద కాలంలో ఉన్న అభాగ్యులను ఆదుకునేందుకు తన వంతుగా రక్తాన్ని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మహేష్ బాబు మాట్లాడుతూ రక్తదాతే ప్రాణదాత ఆని యువత మీదే దేశ ప్రగతి ఆధారపడి ఉందని రక్తదానం లాంటి మంచి పనుల్లో పాల్గొని ఎదుటివారి ప్రాణాలు కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ కె వై యస్ డైరెక్టర్ అంచుమబ్ ప్రసాద్ దాస్, జిల్లా యూత్ ఆఫీసర్ ఐసయ్య, ఏ డి ఎం హెచ్ ఓ సోలమన్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జ్యోతి, ముత్తూట్ ఫైనాన్స్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, ఉప్పరి గూడ పంచాయతీ కార్యదర్శి రుషిక నేత, శ్రీ ఇందు, జి ఎన్ ఐ టి, సిద్ధార్థ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కళాశాలల విద్యార్థులు 65 మంది పాల్గొని రక్తదానం చేశారు అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు అందరిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేష్ బాబు అభినందించారు.

Next Story
Share it