Sneha TV
తెలంగాణ

శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్లు పంపిణీ

శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్లు పంపిణీ
X

మేడిపల్లి, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాత అనురాధ సహకారంతో రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద చలికి ఇబ్బంది పడుతున్న 10 మంది యాచకులకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తమన్ మాట్లాడుతూ రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై దేవాలయ దగ్గర వృద్ధులు, అనాధ పిల్లలు ఎంతో మంది చలికి ఇబ్బంది పడుతుండడం చూసి మా ట్రస్ట్ ద్వారా దాతల సహకారంతో 900 మందికి దుప్పట్లు పంపిణీ చేయాలనుకుంటున్నామని తెలిపారు. సహాయం చేయదలచిన దాతలు ఈ ఫోన్ నెంబర్ 9177745159 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it