Sneha TV

నేడే బతుకమ్మ పండుగ మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత శ్రీధర్

నేడే బతుకమ్మ పండుగ మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత శ్రీధర్
X

బెల్లంపల్లి, అక్టోబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి సంవత్సరం మాదిరిగానే భాద్రపద అమావాస్య తొమ్మిదవ రోజు నుండి తొమ్మిది రోజులు బతుకమ్మను ఆడుకోవడం మన సాంప్రదాయం కావున మన సాంప్రదాయం ప్రకారం సద్దుల బతుకమ్మను ఈనెల 14వ తేదీ గురువారం నాడు జరుపుకోవల్సిందిగా బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, బెల్లంపల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం గురువారం నాడు యధావిధిగా విజయదశమి "దసరా" పండుగ జరుపుకోవాలని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా అయోమయానికి గురికాకుండా గురువారం నాడు సద్దుల బతుకమ్మను శుక్రవారం నాడు దసరా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మునిసిపల్ పరిధిలోని పట్టణ ప్రజలందరికీ ఆమె సద్దుల బతుకమ్మ, విజయదశమి "దసరా" పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story
Share it