Sneha TV

చండీ హోమం నిర్వహించిన తిండేరు హనుమంతరావు దంపతులు

చండీ హోమం నిర్వహించిన తిండేరు హనుమంతరావు దంపతులు
X

మేడిపల్లి, అక్టోబర్13 (ప్రజాపాలన ప్రతినిధి) : దసరా నవరాత్రిదుర్గాష్టమి సందర్భంగా రామంతాపూర్లోని గణేష్ నగర్ వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ హనుమంతరావు సతీమణి సురేఖ చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ లతోపాటు భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it