Sneha TV

సిపిఐ పోరాట ఫలితమే మడుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ : బెజవాడ రవి

సిపిఐ పోరాట ఫలితమే మడుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ : బెజవాడ రవి
X

మధిర, అక్టోబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : మడుపల్లి సిపిఐ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో బెజవాడ రవి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా మడుపల్లిలో కట్టుబడి పూర్తిచేసుకొన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపింణి చేయకుండా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటే పెదప్రజలపక్షాన లబ్ది దారులతో కలసి సెప్టెంబర్ 14న సిపిఐ ఆధ్వర్యంలో మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో నిర్మాణం పూర్తిచేసుకొన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా బెజవాడ రవి మాట్లాడుతూ దసరా పండుగ రోజు వరకు అధికారులు పంపిణీ చేయకపోతే దసరా రోజున సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని ఆరోజు అధికారులను హెచ్చరించారు. దాని ఫలితంగా మడుపల్లిలో ఈరోజు లబ్ధిదారుల సమక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లాటరీ ద్వారా పంచడం జరిగిందని బెజవాడ రవి అన్నారు. ప్రజా పోరాటలే అంతిమంగా విజయం సాధిస్తాయని అన్నారు. మడుపల్లిలో ఇంకా 13 మంది ఇళ్ళు లేని కడుపేదవారు ఉన్నారని, కనీసం ప్రభుత్వ ఖాళీ స్థలాలలో వారికి ఇంటి జాగా ఇవ్వాలని అధికారులను కోరినారు. ఈ సమావేశంలో పెరుమాళ్లపల్లి ప్రకాశరావు, రంగు నాగకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, సిరివేరు శ్రీను, జల్లా బ్రమ్మం, ఊట్ల కామేశ్వరరావు, పంగా శేషగిరి, అప్పారావు, బుల్లిరావు పాల్గొన్నారు.

Next Story
Share it