Sneha TV

పార్మ సిటీ రైతులకు అండగా ఉండాలని వైయస్ షర్మిలకు వినతిపత్రం అందజేసిన నియోజకవర్గం వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు

పార్మ సిటీ రైతులకు అండగా ఉండాలని వైయస్ షర్మిలకు వినతిపత్రం అందజేసిన  నియోజకవర్గం వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు
X

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ దీక్ష చేస్తున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలుగురి అమృత సాగర్ మాదగోని జంగయ్య గౌడ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముఖ్యనాయకులతో కలిసి దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం పార్మసిటీలో భూములు కొల్పుతున్న రైతులకు అండగా ఉండాలని, జిల్లాలో మొదలు పెట్టే పాదయాత్ర లో భాగంగా యాచారం మండలం పార్మ సిటీ రైతులను కలిసి వారికి అండగా ఉండాలని వినతి పత్రం అందచేయటం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్మ సిటీకి భూసేకరణలో భాగంగా మూడు వేల ఎకరాలో పార్మ సిటీ ఏర్పాటు చేస్తామని రైతులను నమ్మించి మాట మార్చి ఇప్పుడు బలవంతంగా బడుగు, బలహీన వర్గాల పేద రైతుల భూములను యాబై మూడు వేల ఎకరాల భూములను ప్రభుత్వం అక్రమించు కుంటుందని అన్నారు. దీని వల్ల ఎంతో మంది రైతన్నలు ఉపాధి కోల్పోయారు. పాద యాత్ర యాచారం మండలం కూర్మిద్ద గ్రామంలో రైతుల పరామర్శ వేదికను ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉండాలని వైయస్ షర్మిల కు వివరించమని అన్నారు. ఈ కార్యక్రమంలో నేనవత్ శ్రీనివాస్ నాయక్, మంచాల మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకుడు పంది జయరాజ్, యాచారం మండలం నాయకులు ఉడుగుల బాస్కర్ గౌడ్, ఇబ్రహీంపట్నం మండలం దూసరి వేణు ప్రసాద్ గౌడ్, గోరెంకాల నందకుమార్ ముదిరాజ్, కొమ్ము సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it