Sneha TV

బింగి మనోజ్ ఆధ్వర్యంలో దుర్గామాత సన్నిధిలో చండీ యాగం, అన్నదానం.

బింగి మనోజ్ ఆధ్వర్యంలో దుర్గామాత సన్నిధిలో చండీ యాగం, అన్నదానం.
X

కొడిమ్యాల, అక్టోబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని రేంజ్ ఆఫీస్ దగ్గర ఉన్న దుర్గామాత సన్నిధిలో బుధవారం రోజున సామాజిక కార్యకర్త, ట్రస్ట్ అవర్ జగన్మాత శంకర్ మల్లన్న హ్యూమన్ నెట్ వర్క్ అధ్యక్షులు, విగ్రహ దాత బింగి మనోజ్ ఆధ్వర్యంలో దుర్గామాతకు పూజలు, చండీ యాగం నిర్వహించారు. అనంతరం వెయ్యి మందికి బింగి మనోజ్ అన్నదానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజ సేవ అలవాటు చేసు కోవాలని, భక్తి భావంతో, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చెన్న నరేందర్, బింగి గణేష్, శ్రీను, సందీప్, అఖిల్, రవి, గంగేశ్వర్, ధనుంజయ్, అజయ్, రాము, జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత ఏనుగు ఆదిరెడ్డి, బింగి మనోజ్ కుటుంబ సభ్యులు, మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story
Share it