Sneha TV

అవెన్యూ మొక్కలకు వైట్ పేయింటింగ్

అవెన్యూ మొక్కలకు వైట్ పేయింటింగ్
X

అత్వెల్లి జై భీమ్ యూత్ సభ్యులు

వికారాబాద్ బ్యూరో 13 అక్టోబర్ ప్రజాపాలన : గ్రామ ప్రవేశ ప్రధాన రోడ్డుకు ఇరువైపుల ఉన్న మొక్కలకు వైట్ పెయింటింగ్ వేశామని అత్వెల్లి జై భీమ్ యూత్ సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా అత్త్వెల్లీ గ్రామంలో ఏర్పాటు అయినటువంటి జై భీమ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. అందులో భాగంగానే గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు వైట్ పేయింటింగ్ వేశామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అత్వెల్లి జై భీమ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం పెడతామని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను సమకుర్చటానికి పై అధికారులను సందర్శించి గ్రామ అభివృద్ధికి తోడ్పడటమే యూత్ యొక్క అజెండా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్, ఖజానా అధికారి రాజ్ కుమార్, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీలు ES. మోహన్, J.మోహన్, కో ఆప్షన్ మెంబర్ లు విజయ్ కుమార్, తరుణ్, కో ఆర్డినేటర్ లు వినోద్, వేణు, మీడియా మిత్రులు విక్రమ్, అరుణ్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story
Share it