Sneha TV

అంబరాన్నంటిన మహా బతుకమ్మ సంబరాలు

అంబరాన్నంటిన మహా బతుకమ్మ సంబరాలు
X

జగిత్యాల, అక్టోబర్, 13 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఆరున్నర టన్నుల పూలతో మహా బతుకమ్మ ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉరేగింపు కార్యక్రమాన్ని జెడ్.పి చెర్మెన్ దావా వసంత, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ ప్రారంభించారు. అనంతరం నృత్యం చేసిన చిన్నారులకు, మెప్మా సిబ్బందికి బహుమతులు అందజేసినారు. మహా బతుకమ్మ ఉత్సవాలలో వైశ్య భవన్ నుండి పురపాలక సంఘమునకు మహా బతుకమ్మను కోలాటాలు, నృత్యములతో తీసుకువచ్చి మున్సిపల్ ఆవరణలో బతుకమ్మ పండుగ మహిళలతో సంబురంగా నిర్వహించినారు. తదుపరి పుర విధుల వెంట మహాబతుకమ్మ శోభ యాత్ర ఘనముగా నిర్వహించి మినీ ట్యాంక్ బండ్ చింతకుంట చెరువులో నిమాజ్ణనము చేసినారు. ఈ కార్యక్రమములో ఆర్.డి.ఓ మాధురి, మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, కొరుట్ల మెట్ పల్లి చెర్ పర్సన్లు అన్నము లావణ్య రనావేని సుజాత, వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్, గౌరవ కౌన్సిల్ సభ్యులు, కో అప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story
Share it