Sneha TV

బతుకమ్మ ఆడిన బెల్లంపల్లి మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు

బతుకమ్మ ఆడిన బెల్లంపల్లి మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు
X

బెల్లంపల్లి, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బెల్లంపల్లి మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు, ఆర్ పి, లు కో ఆప్షన్ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే సతీమణి దుర్గమ్ జయ తార వారి కుటుంబ సభ్యులతో సోమవారం నాడు సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కోలాహలంగా బతుకమ్మను ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ఎంతో ఆరాద్య దైవంగా భావిస్తూ ఈ పండుగను ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా బెల్లంపల్లి కి వచ్చి బతుకమ్మను ఆడుకోవడం ఆనవాయితీగా వస్తుందని అందుకే మహిళలు ఏ స్థాయిలో ఉన్న బతుకమ్మను ఆడుకోవడం ఎంతో ఇష్టంతో ఆడుకుంటారని ఈ సంవత్సరం కూడా అదేవిధంగా బెల్లంపల్లి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి మహిళా సోదరీమణులు బతుకమ్మను ఆడుకోవాలని అందుకు స్థానిక నెంబర్ టు గ్రౌండ్ మరియు పోచమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని బతుకమ్మను మహిళా సోదరీమణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బతుకమ్మలను ఆడుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జయ తార, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కళ్యాణి, పది హేడు మంది మహిళా కౌన్సిలర్లు ఇరవై మంది వరకు ఆర్ పి,లు వారి పిల్లలు, తదితరులు బతుకమ్మ ఆడుకున్నారు.

బెల్లంపల్లి పట్టణం :

పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో మరియు కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యుల కుటుంబ సభ్యులతో మమేకమై బతుకమ్మ ఆట పాటలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి సతీమణి శ్రీమతి శ్రీ జయ తార గారు, గౌరవ AMC చైర్ పర్సన్ గడ్డం కళ్యాణి భీమా గౌడ్ గారు, గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ గారు, బుగ్గ దేవాలయ చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవి గారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యులు, పట్టణ మహిళా ప్రెసిడెంట్ సత్యవతి గారు,మున్సిపల్ సిబ్బంది, ఆర్పీ లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it