Sneha TV

తెరాసలో చేరిన కాంగ్రెస్ నాయకులు...

తెరాసలో చేరిన కాంగ్రెస్ నాయకులు...
X

జగిత్యాల, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల అర్బన్ మండలం తిప్పన పేట గ్రామపంచాయతీ పరిధిలో గల గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన 30 మంది గ్రామస్తులు మంగళవారం రోజున జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ జిల్లా జడ్పీ చైర్మన్ దావ వసంతసురేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరాగ తెరాస పార్టీ కండువలను కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే జడ్పీ చైర్ పర్సన్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంగెపు మహేష్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం మహేష్ వార్డ్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టేక్కాబ్ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం జగిత్యాలకు రాగా ఎమ్మెల్యే క్వార్టర్ లో వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికిన ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ జడ్పీ చైర్ పర్సన్ దావా వసంతసురేష్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి లైబ్రరీ చైర్మన్ డా:చంద్రశేఖర్ గౌడ్ కెడిసిసి జిల్లా మెంబర్ రామచందర్ రావు ఏఎంసి చైర్మన్ దామోదర్ రావు ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి మల్లారెడ్డి రాజిరెడ్డి నరసింహ రెడ్డి రాజలింగం జిల్లా రైతుబంధు మెంబెర్ బాల ముకుందాం నాయకులు ఆనంద్ రావు గంగారెడ్డి రిజవాన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it