Sneha TV

ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ ను కలిసిన - శ్రీ భలరామకృష్ణ యాదవ సంఘం

ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ ను కలిసిన - శ్రీ భలరామకృష్ణ యాదవ సంఘం
X

బీరుపూర్, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్ నర్సింహులపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన శ్రీ భలరామ కృష్ణ యాదవ సహకార సంఘం అధ్యక్షడు కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మంగళవారం రోజున క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎన్నికైన నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రిక్కల ప్రభాకర్ అధ్యక్షుడు అన్నం రాజేందర్ ప్రధాన కార్యదర్శి గొర్ల ప్రశాంత్ ఉపాధ్యక్షుడు కటికరెడ్డి సతీష్ గొడుగు మధుసూదన్ లింగాల మహేష్ జంగిలి మల్లేశ్ సించు మల్లేశ్ సుధ నరేందర్ గొట్టే అంజన్న గుడిసె చంద్రప్రకాశ్ ఎడ్ల నారాయణ కార్యవర్గ సభ్యులు తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.

Next Story
Share it