Sneha TV

ఎస్టియూటీఎస్ రాష్ట అసోసియేట్ అధ్యక్షులుగా అర్ భూమయ్య

ఎస్టియూటీఎస్ రాష్ట అసోసియేట్ అధ్యక్షులుగా అర్ భూమయ్య
X

కోరుట్ల, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : సుదీర్ఘకాలంగా రాష్ట్రోపాధ్యాయ సంఘంలో వివిధ హోదాలలో సేవలందిస్తున్న కోరుట్ల వాస్తవ్యులు దూలూరు ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాజోజీ భూమయ్య రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియూటీఎస్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఆదిలాబాద్ లో సంఘం 75వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో 2021-23 సంవత్సరానికి గాను ఎన్నుకున్న కార్యవర్గంలో ఆయనకు చోటు దక్కింది. ఈ ఎంపిక పట్ల ఎస్టీయుటిఎస్ కోరుట్ల మండల శాఖ అధ్యక్షలు పాలేపు శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శులు నల్ల సాయి కుమార్, కథలాపూర్ మండల అధ్యక్షలు నల్ల రాజ్ కుమార్ కార్యదర్శులు అడేపు రాజశేఖర్ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అర్ భూమయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సంఘ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నిక సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు సదానందగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైరి హరిచరణ్, మచ్చ శంకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story
Share it