Sneha TV

ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఘనంగా బతుకమ్మ వేడుకలు
X

ఎర్రుపాలెం, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : బనిగండ్లపాడు గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ రమణారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ జంగా పుల్లా రెడ్డి విచ్చేశారు. పుల్లా రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ అని తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అనేది పెద్ద పండుగగా కొనియాడతారు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణారెడ్డి, కళాశాల సిబ్బంది, టిఆర్ఎస్ మహిళా మండలి అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి, విద్యార్థినులు పాల్గొన్నారు

Next Story
Share it