Sneha TV

ప్రెస్ క్లబ్ లో ఖాళీ అయిన పదవుల ఎన్నిక

ప్రెస్ క్లబ్ లో ఖాళీ అయిన పదవుల ఎన్నిక
X

వికారాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం.రవీందర్

వికారాబాద్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా ప్రెస్ క్లబ్ లో అనివార్య కారణాలతో ఖాళీ అయిన పదవులను సభ్యుల సమక్షంలో చర్చించి ఏకగ్రీవంగా ఎన్నుకొని నియమించామని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం.రవీందర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో వికారాబాద్ విలేఖరుల మిత్ర బృంద సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా కోరె నాగరాజు (టివి 5), ఉపాధ్యక్షులుగా దొడ్ల ఆనంద్ (జ్యోతి), సమన్వయ కార్యదర్శిగా మాచన్నగారి గైబులు (ప్రజాపాలన), కార్యదర్శిగా కోటపల్లి సంతోష్ (6 టివి), నిర్వాహణ కార్యదర్శులుగా మర్రి నాగిరెడ్డి (ఏబి టివి క్రైమ్), కోటపల్లి నర్సిములు (ప్రజాజ్యోతి)లను ఏకగ్రీవంగా ఎన్నుకొని తీర్మాణించి ఆమోదించనైనదని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోరె నాగరాజు మాట్లాడుతూ.. విలేఖరుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ విలేఖరులు పాల్గొన్నారు.

Next Story
Share it