Sneha TV

బ్రహ్మకమలంతో మాచన్నగారి సౌమ్య

బ్రహ్మకమలంతో మాచన్నగారి సౌమ్య
X

వికారాబాద్ బ్యూరో 12 సెప్టెంబర్ ప్రజాపాలన : ఇప్పటి వరకు మా ఇంట 8 బ్రహ్మకమలాలు వికశించడం చాలా సంతోషంగా ఉందని మాచన్నగారి సౌమ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ద్వాదశ సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బ్రహ్మకమలాలు వికశిస్తాయని పేర్కొన్నారు. బ్రహ్మకమలాలతో శివారాధన చేస్తే దైవాశీస్సులు మెండుగా లభిస్తాయని వెల్లడించారు. బ్రహ్మకమలాలు వికశించిన ఇంట సుఖ సంతోషాలు పరిఢవిల్లుతాయని పెద్దల ఉవాచ అని గుర్తు చేశారు. బ్రహ్మకమలాలతో రుద్రాభిషేకం నిర్వహించిన వారికి శివుని అనుగ్రహం తప్పక ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మ మాచన్నగారి వనజ, చెల్లెలు మాచన్నగారి సౌజన్యలు బ్రహ్మకమలం వికశించడంతో హర్షం వ్యక్తం చేశారు.

Next Story
Share it