Top
Sneha TV

సీఎం రిలీఫ్ ఫండ్ మీద నిరుపేదలకు భరోసా

సీఎం రిలీఫ్ ఫండ్ మీద నిరుపేదలకు భరోసా
X

బాలాపూర్, జులై 13, ప్రజాపాలన ప్రతినిధి : నిరుపేదల ప్రజలకు ఆపన్నహస్తం గా మారిన సీఎం రిలీఫ్ ఫండ్ అని కార్పొరేటర్ లతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల గూడ 40వ డివిజన్ కార్పొరేటర్ గడ్డమీది రేఖ లక్ష్మణ్ ముదిరాజ్ సమక్షంలో 60 వేల చెక్కును ఆ డివిజన్ నివాసులైన చిట్టాల ప్రేమ్ సాగర్ రెడ్డి(43) తండ్రి రంగారెడ్డి ప్రస్తుతం హాస్పిటల్ లో క్యాన్సర్ తో చికిత్స పొందుతున్న చిట్టాల ప్రేమ్ సాగర్ రెడ్డి భార్య జయకు మంగళవారం నాడు మంత్రి నివాసం నందు ఆ డివిజన్ స్థానిక కార్పొరేటర్ భర్త సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...... తెలంగాణ నిరుపేద ప్రజలకు ఆపన్నహస్తం గా మారిన సీఎం సహాయనిధి చెక్కు ల మీద పూర్తి నమ్మకం ఉందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పొందినందుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భర్త గడ్డమీది లక్ష్మణ్ ముదిరాజ్, బాధితులు పాల్గొన్నారు.

Next Story
Share it