Top
Sneha TV

బాధిత కుటుంబానికి భరోసా...

బాధిత కుటుంబానికి భరోసా...
X

సారంగాపూర్, జులై 13 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పురాణం రాజేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా మంగళవారం రోజున వారీ కుటుంబాన్ని పరామర్శించి వారి పిల్లల భవిష్యత్తు కోసం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సారంగాపూర్ మండల్ బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ అందజేశారు. ఇద్దరి పిల్లల చదువుల కోసం ఎటువంటి సహాయం చేయడానికైన కూడ వెనకడుగు వేసేది లేదని తెలిపారు. పెంబట్ల ఆటో యూనియన్ మిత్రులు 13 వేలు రేచపల్లి ఆటో యూనియన్ 2 వేలు మొత్తం 20 వేల రూపాయలను పోస్ట్ ఆఫీసులో పిల్లల పేరిట జమచేశారు. ఈ కార్యక్రమంలో తోట సంతోష్ మధు తెలు నరేశ్ బొడ్డుపెళ్లి శేఖర్ చంద్ర శేఖర్ వెంకటేష్ సంతోష్ ప్రశాంత్ పాల్గొన్నారు.

Next Story
Share it