Top
Sneha TV

మద్గుల్ చిట్టంపల్లిలో గులాబి భరోసా

మద్గుల్ చిట్టంపల్లిలో గులాబి భరోసా
X

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి 18 ( ప్రజాపాలన ): పార్టీ ప్రతిష్ఠతకు కార్యకర్తలే పునాది రాళ్ళని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 8, 7, 31వ వార్డులకు చెందిన మద్గుల్ చిట్టంపల్లి, శివరాంనగర్ లలో వార్డు మెంబర్లు కుమ్మర్పల్లి గోపాల్ ముదిరాజ్, పరిగి సంతోష నర్సిములు, పట్టణ కోశాధికారి మాలె లక్ష్మణ్ ఆధ్వర్యంలో శివారెడ్డిపేట్ పిఏసిఎస్ వైస్ చైర్మన్ గడ్డమీది పాండు ముదిరాజ్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్, కౌన్సిలర్లు చిట్యాల అనంత్ రెడ్డి, మల్లేపల్లి నవీన్ కుమార్ ల సమక్షంలో గులాబి భరోసా లో భాగంగా పార్టీ సభ్యత్వం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 50 వేల పార్టీ సభ్యత్వ లక్ష్యాన్ని పూర్తి చేయుటకు మనమందరం అవిశ్రాంత కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు. నిర్దేశ లక్ష్యం కంటే ఎక్కువ సభ్యత్వం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. సాధారణ కార్యకర్త 30 రూపాయలు, క్రియాశీలక కార్యకర్త 100 రూపాయలు చెల్లించి సభ్యత్వాన్ని తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ రాజమల్లయ్య, నాయకులు నర్సింలు, కడియాల వేణు గోపాల్ ముదిరాజ్, గిరీష్ కొఠారి, కిషోర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it