Top
Sneha TV

మంథనిలో న్యాయవాదుల హత్యను తీవ్రంగా ఖండించిన బీజేపీ ఎస్టీ మోర్చా నాయకుడు దేవావత్ భరత్ సింగ్

మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాదులైన భార్యాభర్తలు గట్టు వామనరావు, నాగమణి లను అత్యంత క్రూరంగా, పాశవికంగా రోడ్డు పైనే హత్యచేయడాన్ని బీజేపీ ఎస్టీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుందని మోర్చా నాయకుడు భరత్ సింగ్ తెలిపారు.

మంథనిలో న్యాయవాదుల హత్యను తీవ్రంగా ఖండించిన బీజేపీ ఎస్టీ మోర్చా నాయకుడు దేవావత్ భరత్ సింగ్
X

ఆమీర్ పేట్(ప్రజాపాలన): మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాదులైన భార్యాభర్తలు గట్టు వామనరావు, నాగమణి లను అత్యంత క్రూరంగా, పాశవికంగా రోడ్డు పైనే హత్యచేయడాన్ని బీజేపీ ఎస్టీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుందని మోర్చా నాయకుడు భరత్ సింగ్ తెలిపారు. టి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో న్యాయవాదులకు రక్షణ కరువైందన్నారు. అన్యాయాలను ఎదిరించి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టే న్యాయ వాదులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. వామన రావు దంపతుల హత్యకేసులో నిందితులు ఎంతటి వారైనా సరైన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story
Share it