గ్రామీణ యువత క్రీడలలో రాణించాలి : ఎంపీపీ అరిగెల మల్లికార్జున్
BY Sowjanya16 April 2021 12:32 PM GMT

X
Sowjanya16 April 2021 12:32 PM GMT
ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) : గ్రామీణ యువత క్రీడలలో రాణించాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ అన్నారు. గురువారం మండలంలోని రౌట సంకేపల్లి, పర్శ నంబాల, గ్రామాలలో పర్యటించి, పర్శ నంబాల లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామీణ యువత చదువులతో పాటు క్రీడలలో కూడా రాణించి, మండలానికి మంచి పేరు తేవాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసుకు రావాలన్నారు. అలాగే పర్శనంబాల నుండి రౌట గ్రామం వరకు చేస్తున్న గ్రావెల్ రోడ్డు ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, నాయకులు కృష్ణయ్య, గ్రామ ప్రజలు ఉన్నారు.
Next Story