తుఫాన్ మృతులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
పునరావాస కేంద్రాల లో ఆశ్రయం పొందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపు న ఒక్కొక్కరికి రూ.500 ల ఆర్థిక సాయం

- పునరావాస కేంద్రాల లో ఆశ్రయం పొందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపు న ఒక్కొక్కరికి రూ.500 ల ఆర్థిక సాయం
- నీవేర్ తుఫాన్ లో సంభ వించిన అన్ని రకాల నష్టాలకు సంబంధించిన సమగ్ర నివేదికను డిసెంబర్ 15 తేదీ లోపు నివేదికలను అంధాజీయాలి
- దేశ ముఖ్యమంత్రి ఎస్.జగన్ మోహన్ రెడ్డి
- చిత్తూర్ నెల్లూరు కడప జిల్లాలలో సీఎం ఏరియల్ సర్వే
వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంటనష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంటనష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతిఒక్క వరద బాధితుడిని మానవతాధృక్పథంతో చూడాలని అన్నారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.
నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వచ్చారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి.
నివర్ తుపాన్ ఏరియల్ సర్వే అనంతరం సీఎం వైఎస్ జగన్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా సమావేశానికి హాజరు అయ్యారు. ఈ భేటీలో వరద నష్టాలను ప్రజాప్రతినిధులు సీఎం జగన్ దృష్టికి తేనున్నారు.
అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతిఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. కాగా నివర్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తుపాను ప్రభావిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. నష్టపోయిన రైతులను అదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.