politicalజాతీయం

ఆర్టికల్ 370 గురించి కమల్ హసన్ స్పదన

జ‌మ్మూక‌శ్మీర్‌లో ప్రత్యేక హోదా క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండుగా విభ‌జిస్తూ కేంద్ర స‌ర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని త‌మిళ‌నాడుకు చెందిన మ‌క్కల్ నీధి మ‌యం పార్టీ నేత క‌మ‌ల్‌హాస‌న్ ఖండించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వం వ్యవ‌హ‌రించిన తీరు అది ప్రజాస్వామ్యంపై దాడి చేసిన‌ట్లుగా ఉంద‌న్నారు. ప్రభుత్వం నిర్ణయం ఆక్షేప‌ణీయంగా ఉంద‌ని, అది నిరంకుశ చ‌ర్య అని అన్నారు. ఆర్టిక‌ల్ 370, 35ఏల‌కు ఓ ప్రత్యేక‌త ఉన్నద‌ని, కానీ మార్పులు చేయాల‌నుకుంటే, ముందుగా చ‌ర్చల ద్వారా ఆ ప్రక్రియ చేప‌ట్టాల‌న్నారు.