Top
Sneha TV

సోమనాథ ఆలయం, గుజరాత్

X

సోమనాథ్ – సర్వశక్తి సంపన్నుడు – చంద్రుని పరిరక్షకుడు

ఈ ఆలయం వెనుక దాగిన పురాణ గాథ ఇలా చెబుతున్నది : సోముడు (చందుడు) దక్ష ప్రజాపతి కూతుళ్లు ఇరవై ఏడు మందిని వివాహం చేసుకొన్నాడు. అయితే అతడు రోహీణి పై మాత్రమే మోజు చూపుతూ ఇతర భార్యలను నిర్లక్ష్యం చేయసాగాడు. వారు తమకు జరుగుతున్న న్యూనతను తమ తండ్రి దక్షుని దృష్టికి తీసుకొనివచ్చారు. ఈ విషయంగా మామ అల్లుళ్లకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన దక్షుడు చంద్రునికి శాపం ఇస్తాడు. చంద్రుని వెలుగు రోజురోజుకి తరగిపోవాలని ఆ శాపం. దీనితో దేవతలందరికీ ఇబ్బంది ఎదురయింది. వారందరూ బ్రహ్మను సమీపించి చంద్రకాంతి లేమితో ఎదురవుతున్న ఇబ్బందిని వివరించి పరిష్కారం కోరుతారు. బ్రహ్మ దేవతలకు అనునయంతో శివుని ప్రార్థించడం, సంతుష్టుని చేయడం వల్ల మాత్రమే సోముడు (చంద్రుడు) శాప విముక్తి పొందగలడని వివరిస్తాడు.

సోముడు శివుని ప్రార్థిస్తూ ఘోరతపస్సు చేసి మెప్పించి వరం పొందుతాడు, శివుని వరం ప్రకారం చంద్రుడు పక్షం రోజులపాటు రోజురోజుకు హెచ్చు ప్రకాశం పొంది, తర్వాత పక్షం రోజులలో తాత్కాలికంగా తన కాంతిని కొంతకొంతగా కోల్పోతాడు. దీని అర్థం చంద్రుడు చంద్రుడు తన కాంతి దశలవారీగా పెంచుకొని, ఆ తర్వాత కోల్పోతుంటాడు. చంద్రునికి శాపవిమోచనం కలిగినందుకు, గుజరాత్ లో సోమనాథ్ ఆలయం నెలకొన్నందుకు శివుని పలువురు స్తుతిస్తారు. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో , తర్వాత రావణుడు వెండితో, ఆతర్వాత శ్రీకృష్ణుడు శ్రీగంధంతో నిర్మించినట్లు ఐతిహ్యం.

Next Story
Share it