Top
Sneha TV

త్రికోటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండ

X

త్రికోటేశ్వర స్వామిగా, త్రికుటేశ్వర స్వామిగా పూజలందుకొంటున్న ఈశ్వరుడు కోటప్పకొండ గ్రామంలో వెలిశాడు. కోటప్పకొండ గుంటూరు జిల్లాలో ఉన్నది. కొండప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో ప్రధాన దైవం త్రికోటేశ్వర స్వామి. కోటప్పకొండకు ఒక విశిష్టత ఉన్నది. కొండను ఏ దిశ నుండి చూచినా దాని మూడు శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడు శిఖరాలు సృష్టి, స్థితి, లయ కర్తలయిన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా పేర్కొనబడుతున్నాయి. వీటి కారణంగా ఈ కొండను త్రికూటాద్రిగా కూడా వ్యవహరిస్తారు. కోటప్ప కొండ పరిసరాలలో నాలుగు ఆలయాలు ఉన్నాయి. ప్రధాన దైవంగల ఆలయం భూతలం నుండు సుమారి 1500 అడుగుల ఎత్తులో ఉన్నది.

కాకులకు తావులేని కోటప్పకొండ:

ఇక్కడ కాకులు కనిపించవు. ఒకప్పుడు ఒక శివభక్తురాలు శివునికి పూలు పండ్లు నైవేద్యం పెట్టి పూజిస్తుండేది. ఒకరోజున ఆమె పూలు పండ్లతో గుడికి వెడుతుండగా ఒక కాకి పండ్లకోసం ఆమె వెంటపడి వేధించసాగింది. ఆ భక్తురాలు విసిగిపోయి, కాకి గుడిలోకి రాకూడదని శపించింది. నేటికీ కాకులు ఈ గుడిలోనికి రాకపోవడం ఆలయ విశిష్టతకు చిహ్నమని చెబుతారు.

Next Story
Share it