Top
Sneha TV

భీమాసుర సంహారంతో భీమశంకరుడైన శివుడు

X

బ్రహ్మ వరంతో ముప్పు: ఒకప్పుడు సహయాద్రి కొండ శ్రేణులలోని డాకిని అడవులు భీముడనే రాక్షసునికి స్థావరంగా ఉండేది. అతడు కర్కతి, కుంభకర్ణుల కొడుకు. మహావిష్ణువు తన రామావతారంలో కుంభకర్ణుని సంహరించినట్లు కర్కతి తన కొడుకు భీమునికి తెలియజేస్తుంది. దీనితో భీముడు విష్ణువుపై పగ సాధించదలచాడు. తన ప్రయత్నంలో విజయానికై భీముడు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు జరిపాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ అతనికి పెక్కు వరాలు ప్రసాదించాడు.

దీనితో భీముడు విజృంభించి లోక కంటకుడైనాడు. బ్రహ్మ వల్ల జరిగిన పొరపాటు కారణంగా ముల్లోలాలకు ముప్పు వాటిల్లింది. ఇంద్రుడు భీమునిచే రాజ్యబ్రష్టుడైనాడు. మునులు దిక్కులకొకరుగా పరిగెత్తారు. భీముడు మహాశివభక్తుడైన కామరూపేశ్వరునిపై దాడిచేసినప్పుడు శివుడు ప్రత్యక్షమై తన భక్తుని రక్షించేందుకు భీముని భస్మం చేశాడు. దుష్టుడైన భీముని సంహారం దేవతలకు మునులకు ఆనందం కలిగించింది. దేవతలు శివుని ప్రార్థిస్తూ భీమసంహారం జరిగిన స్థలంలో అక్కడే నిలిచిపోవాలని కోరగా శివుడు జ్యోతిర్లింగంగా (భీమశంకర లింగంగా) నిలిచిపోయడు.

Next Story
Share it