Top
Sneha TV

శ్రీ వీరభద్రస్వామి ఆలయం లేపాక్షి

X

అనంతపురం జిల్లాలో హిందూపురం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోని లేపాక్షి గ్రామంలో వెలసిన శ్రీవీరభద్రస్వామి ఆలయం శిల్ప సంపదకు కాణాచి. విజయనగర రాజుల కాలంనాటి శిల్పకళను వెల్లడింఛే రాతి శిల్పాలు అపురూపమైనవి. అలాగే ఆలయంలోని చిత్రకళ కన్నుల పండుగ చేస్తుంది. ఆలయానికి పౌరాణిక మరియు చారిత్రక ప్రాశస్త్యం ఉన్నాయి.

ఫౌరాణికంగా చూస్తే త్రేతాయుగం నాటి సంఘటనలు వెలుగులోకి వస్తాయి. శ్రీరామచంద్రుడు భార్యను వెదుకుతూ లేపాక్షి ప్రాంతానికి వచ్చినట్లు ప్రతీతి. అయితే అక్కడ గ్రామం లేదు, ఆ పేరు కూడా లేదు. రాముడు భార్యను వెదికే ప్రయత్నంలో, సమీపంలో అవసానదశలో పడిఉన్న జటాయువు పక్షిని కనుగొని దానిని సమీపించి 'లే - పక్షి' అని ప్రేమగా అంటాడు. అలా లే - పక్షి అని రాముడు అనిన స్థలం లేపాక్షిగా వ్యాప్తిలోకి వచ్చిందని ఐతిహ్యం. సీతను రావణడు అపహరించుకొని వెడుతుండగా జటాయువు అడ్డుపడి రావణునితో పోరు సలుపుతాడు. రావణుడు జటాయువు రెక్కలను తెగనరుకుతాడు. జటాయువు రామునికి సీత గురించి వివరించి ప్రాణాలు వదలుతాడు. రాముడు ఇక్కడ జటాయువులు అంతిమక్రియలు జరిపినట్లు చెబుతారు.

లేపాక్షి ఆలయంలో వీరభద్రస్వామి, దుర్గాదేవి, పాపనాశేశ్వరుడు, రాముడు కొలువై ఉన్నారు. దుర్గమ్మ మహిమగల దేవతగా పేరు పిందింది. ఆలయంలో పద్మినీ జాతి స్త్రీ మరియు వాస్తుపుషుల విగ్రహాలను ఒకే స్థంభంపై చెక్కారు. శివకేశవులకు భేదం లేదని చెప్పడానికై ఆలయంలో పాపనాశేశ్వరుడి లింగం, శ్రీరాముని విగ్రహం ఒకట్కొటి ఎదురుగా ప్రతిష్ట చేయబడినాయి. వాటికి ఒకే మారు ఇద్దరిచే హారతి ఇవ్వబడుతుంది. లేపాక్షి ఆలయంలో నేలకు తాకని ఒక పెద్ద రాతి స్థంభం ప్రధాన ఆకర్షణ.

శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉండడం ఆనవాయితీ. దీనికిగాను ఆలయంలోని నాగపడుగకు ఎదురుగా ఉండేలా ఊరి వెలుపల అతిపెద్ద నంది విగ్రహాన్ని ఏర్పరచారు. ప్రపంచంలోనే ఈ నంది పెద్దది. (4.5 మీ ఎత్తు,8.23 మీ పొడవు) గ్రామంలోని పశువులకు జబ్బుసోకితే నందికి కొబ్బెరకాయ కొడితే జబ్బు మాయమవుతుందని స్థానికుల విశ్వాసం.

Next Story
Share it