Home > అప్పనపల్లి బాల బాలాజీ ఆలయం
అప్పనపల్లి బాల బాలాజీ ఆలయం
X
తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో వెలసిన బాల బాలాజీ ఆలయ ఉదంతం గగుర్పాటు కలిగిస్తుంది. పురాణేతిహాసాలతో పాటుగా ఆధునిక పోకడలకు అద్దం పడుతున్నది. అప్పనపల్లి నేటి పేరు. లోగడ ఈ గ్రామం పేరు అర్పణ ఫలి. ఫలి అంటే ఫలితం(కష్టే ఫలి అంటే కష్టపడితే ఫలితం అంటారు. అదే విధంగా అర్పణ ఫలి లో కూడా ఫలి అంటే ఫలితం) అర్పణ ఫలి ఏళ్లు దశాబ్దాలు, శతాబ్దాలు యుగాలు గడిచి అప్పనపల్లి అయింది. అప్పనపల్లిలో వైనతేయ నది ఒడ్దున బాల బాలాజి ఆలయం వెలిసింది. బాలుని రూపంలోని బాలాజీయే బాలబాలాజీ.
అడ్రసు: శ్రీ బాలబాలాజీ ఆలయం, అప్పనపల్లి - 533 247, తూర్పు గోదావరి జిల్లా, ఫోన్ : 088622 39562
Next Story