Top
Sneha TV

శ్రీకుక్కుటేశ్వర స్వామి ఆలయం పిఠాపురం

X

గయుడు(లేదా గయాసురుడు) మహా విష్ణుభక్తుడు.ఘోర తపస్సుతో విష్ణువును మెప్పించి తన శరీరానికి ఆచంద్రార్కం కీర్తి లభించాలని వరం పొందాడు. గయుడు తకు లభించిన వరంతో మానవాళిని, దేవతలను హింసించసాగాడు. గయుడు గయాసుర యజ్ఞం పేరుతో ఓ యాగం తలపెట్టాడు. ఈ విషయం తెలుసుకొన్న ఇంద్రుడు భయపడి త్రిమూర్తుల శరణుచొచ్చాడు. గయుడి యాగాన్ని నిలిపివేయడానికై త్రిమూర్తులు పథకం రూపొందించి బ్రాహ్మణుల వేషంలో గయుడి వద్దకు వెళ్లి తాము ఏడు రోజులపాటు ఒక మహత్తర యజ్ఞం తలపెట్టామని, యాగశాలకు అవసరమైన స్థలం కావాలని కోరారు.

గయుడు అంగీకరించి యాగానికి పెక్కు స్థలాలు చూపాడు. అయితే ఆ స్థలాలన్నీ ఏదో ఒక విధంగా అపవిత్రమనదని యాగశాలకు పనికిరావని తేల్చిచెప్పారు. గత్యంతరం లేక గయుడు వారినే ఉపాయం అడిగాడు. నీ శరీరాన్ని యజ్ఞవాటికగా వాడుకొంటామని చెప్పారు. ఏడు రోజులపాటు తన శరీరంపై యాగం జరపడానికి గయుడు అంగీకారం తెలిపాడు. యాగం ప్రారంభమయింది. యాగం మంటలకు శరీరం ఇబ్బంది పడుతున్నది. అయినా మాటకు కట్టుబడి గయుడు బాధను అనుభవిస్తూ కోడికూతలతో రోజులను లెక్కించసాగాడు. గయుడి అంతం చేయదలచిన దేవతలు ఒక వ్యూహం పన్నారు.

ఆరవ రోజు అర్ధరాత్రి సమయంలో శివుడు కోడి రూపం ధరించి కూత పెట్టాడు. దీనితో గయుడు ఉదయం అయిందని, ఏడురోజుపు పూర్తయ్యాయని లేచి నిలబడ్డాడు. తద్వారా యాగం విఫలమయింది. గయుడు తన తప్పిదాన్ని తెలుసుకొని ప్రాయ శ్చిత్తం కోరాడు. త్రిమూర్తులు అతనిని సంఫహరించి తల, నాభి. పాదం ఒక్కొక్క వచోట పడేలా చేశారు. పిఠాపురంలో పాదం పడింది. దీనితో పిఠాపురం పాద గయ అయింది, గయుడి పేరు చిరస్థాయిగా నిలిచేవిధంగా త్రిమూర్తులు దీవించారు.

పిఠాపురంలో వెలసిన దేవి పురుహూతికా. ఆమె 18 శక్తిపీఠాలలో పదవది. ఇక్కడ శివలింగం కోడి ఆకారంలో ఉన్నది. పిఠాపురంలో దత్తాత్రేయ దేవస్థానం ఎంతో పవిత్రమైనది. భక్తుల కోరికలు తీర్చే ఆలయం.

పూజల వేళలు: ఉ. 7.30 నుండి మ. 12.30 వరకు. సా. 4.30 నుండి రా. 8.30 వరకు
ప్రత్యేక పూజలు: శని త్రయోదశి, మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గురుపూర్ణమి, దేవీ నవరాత్రుల సందర్భంగా పిఠాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగుతాయి.

Next Story
Share it