Sneha TV
న్యూస్

నిజమైన క్షమాపణతో వేడుకోవాలి

X

'దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమము లను తుడిచివేయుము నా దోషము పోవ్ఞనట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవ్ఞనట్లు నన్ను పవిత్రపరచుము (కీర్తనలు 51:1,2). ఇజ్రాయేలీయుల రాజైన దావీదు బత్షెబ అనే మహిళతో పాపం చేసినప్పుడు దేవ్ఞడు నాతాను అనే ప్రవక్త ద్వారా దావీదు తప్పును తెలిపినప్పుడు దావీదు రాసిన కీర్తన ఇది. వెంటనే దావీదు నాతానుతో 'నేను పాపము చేసితిని (2 సమూ 12:13) అని చెప్పాడు. సౌలు అనే ఇజ్రాయేలీయు లకు మొట్టమొదటి రాజు దేవ్ఞడు చెప్పిన పని చేయకుండా, ఆయన ఆజ్ఞను తిరస్కరించినప్పుడు సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవ్ఞడు సౌలు తప్పును తెలిపినప్పుడు సౌలు కూడా 'నేనుపాపము చేసితిని (1 సమూ 15:30) అని అన్నాడు. ఇక్కడ దావీదు, సౌలు ఇద్దరు తాము పాపం చేసామని, ప్రవక్తలతో చెప్పారు. అయితే దేవ్ఞడు దావీదును క్షమించాడు కానీ సౌలును క్షమించలేకపోయాడు. ఎందుకని? దావీదు పశ్చాతాప్తంతో క్షమించమని కోరాడు.

మళ్లీ పాపం జోలికి వెళ్లలేదు. సౌలు కూడా తప్పు చేసానని ఒప్పుకున్నాడు కానీ పశ్చా తాప్తం చెందలేదు. తిరిగితిరిగి తప్పులు చేసాడు. దేవ్ఞడికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు.

అందువల్ల దేవ్ఞడు సౌలు క్షమించలేకపోవడం మాత్రమే కాదు, ఆయనను రాజుగా ఉండకుండా సౌలుతోపాటు అతని కుటుంబ సభ్యులను కూడా దేవ్ఞడు హతమార్చాడు. దావీదు వర్ధిల్లినట్లుగా సౌలు వర్ధిల్లలేకపోయాడు. దావీదు దేవ్ఞడికి హృదయాను సారుడిగా జీవించాడు. సౌలు తన స్వార్ధంతో పతనమయ్యాడు.

మనం కూడా తప్పులు చేస్తుం టాం. కానీ ఆ తప్పులును ఏవిధంగా ఒప్పుకుంటు న్నాం? దావీదులాగానా? సౌలులాగానా?

మన పశ్చాతాప్తం దావీదులాగ అయితే దేవ్ఞడి కనికరం, క్షమాపణలు దొరుకుతాయి. తద్వారా దేవ్ఞడిలో వర్ధిల్లుతాం. కానీ సౌలులాగా మన క్షమాపణలు ఉంటే మాత్రం అతడిలాగానే పతనమైపోతాం. మనం ఉద్దేశపూర్వకంగా తప్పులు, పాపం చేయక పోవచ్చు.

కానీ కొన్నిసార్లు యాదృచికంగా, పొర పాటుగా తప్పులు చేస్తే, క్షమించే దేవ్ఞడి వద్ద పశ్చాతాప్తమనసుతో క్షమాపణ వేడుకోవాలి. ఆయన రక్తంతో శుద్ధీకరించుకోవాలి. అప్పుడే మనం దావీదులా దేవ్ఞడి కృపతోపాటు దీవెనలను పొందుతాం.

Next Story
Share it