Top
Sneha TV

ప్రముఖ నిర్మాత మూవీలో 'ఆర్‌ఎక్స్‌100'బ్యూటీ కి అవకాశం

X

ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్‌ఎక్స్‌100. అజయ్‌ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా తొలి సినిమాలోనే బోల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే పాయల్‌ మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ భామ తన రెండో సినిమాకు ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. భానుశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పాయల్ యాక్షన్స్‌ సీన్స్‌ కూడా చేయనుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు సీ కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కించనున్న మరో సినిమాకు కూడా పాయల్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది

Next Story
Share it