Top
Sneha TV

హీరోయిన్ లేఖ చూసి.. కన్నీరు పెట్టిన హీరో....

X

ముంబై :

మిస్టర్ పెర్ఫక్షనిస్టు ఆమిర్ ఖాన్‌కు ఒక హీరోయిన్ లేఖ రాశారు. ఆ లేఖ చదివి ఒక్కసారిగా ఆయన కన్నీరు పెట్టేశారు. ఇంతకీ ఆ లేఖ రాసింది ఎవరో తెలుసా.. అలనాటి అందాల నటి రేఖ. దంగల్ సినిమాలో ఆమిర్ నటన చూసి ఫిదా అయిపోయిన రేఖ.. ఆమిర్‌ను ప్రశంసిస్తూ తనదైన స్టైల్లో ఒక లేఖ రాశారు. ఆ లేఖ చదివిన ఆమిర్ ఖాన్.. ఒక్కసారిగా వలవలా ఏడ్చేశాడు. ఆ లేఖకు తన హృదయంలో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని కూడా చెప్పాడు. సినిమా విజయం సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీకి వచ్చిన రేఖ ఆ లేఖను ఇచ్చిన వెంటనే చదివేసిన ఆమిర్.. ఒక్కసారిగా కదిలిపోయాడు. ఆ సినిమా తనకెంతో స్పెషల్ అని రేఖ చెప్పారట.
ఆమిర్ ఖాన్ తన సినిమాల్లో పెర్ఫెక్షన్ తీసుకురావడమే కాదు.. అన్ని సినిమాలనూ పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తాడు. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయీజాన్ సినిమా చూసినప్పుడు కూడా ఇలాగే కన్నీళ్లు పెట్టుకున్నాడు. దంగల్ ట్రైలర్ చూసినంతసేపు కూడా ఆమిర్ కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. దంగల్ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టింది. భారతదేశంలోనే ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం సందర్భంగానే ఆమిర్ ఈనెల ఐదోతేదీన ముంబైలో ఒక పార్టీ ఏర్పాటుచేసి, బాలీవుడ్‌కు సంబంధించిన అందరినీ దానికి పిలిచాడు. సాధారణంగా పార్టీలకు దూరంగా ఉండే రేఖ.. దీనికి మాత్రం తన ట్రేడ్ మార్కు కాంజీవరం పట్టుచీర కట్టుకుని వచ్చారు.
Next Story
Share it