Top
Sneha TV

'యూటర్న్‌'..కర్మ థీమ్ పాట విన్నారా?

X

అగ్ర కథానాయిక సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యూటర్న్‌'. పవన్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన 'యూటర్న్‌'కు తెలుగు రీమేక్‌ ఇది. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్ణచంద్ర తేజస్వి బాణీలు అందిస్తున్నారు. 'నేను ఈ రకంగా బార్‌ కౌంటర్‌లో ఇన్ని శబ్దాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు.. ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా నిజమా? అబద్ధమా?..' అంటూ ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.

ఇప్పుడు 'యూటర్న్‌ కర్మ థీమ్' పేరిట సమంత ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. సమంత, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌పై ఈ పాటను చిత్రీకరించారు. సమంత చేతులు కట్టేసి ఉండగా..అనిరుధ్‌ పాట పాడుతూ డ్యాన్స్‌ చేయడంతో వీడియో మొదలైంది. ఆ తర్వాత సమంత చేతికున్న కట్లు విప్పుకుని డ్యాన్స్‌ చేయడం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఆది పోలీసు అధికారిగా.. సామ్‌, రాహుల్‌ రవీంద్రన్‌ జర్నలిస్టు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు సమంత సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. సెప్టెంబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Next Story
Share it