Top
Sneha TV

రణ్‌బీర్‌, అలియా పర్‌ఫెక్ట్‌: జయప్రద

X

రణ్‌బీర్‌, అలియా పర్‌ఫెక్ట్‌: జయప్రద

రణ్‌బీర్‌, అలియా పర్‌ఫెక్ట్‌: జయప్రద ముంబయి: రిషి కపూర్‌, జయప్రద జంటగా నటించిన చిత్రం 'సర్గం' (తెలుగులో 'సిరి సిరి మువ్వ'). కె. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. ఎన్‌.ఎన్‌. సిప్పీ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా 1979లో విడుదలై హిట్‌ అందుకుంది. అయితే ఈ సినిమా రీమేక్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ నటిస్తే బాగుంటుందని నటి జయప్రద అభిప్రాయపడ్డారు. 'మీరు నటించిన సినిమాల్లో దేన్ని రీమేక్‌ చేస్తే బాగుంటుంది? అందులో ఎవరైతే సరిపోతారని మీరు అనుకుంటున్నారు?' అని తాజాగా ఓ పత్రిక జయప్రదను ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. ''సర్గం' సినిమా రీమేక్‌ బాగుంటుంది. రిషి కపూర్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ సరిపోతారు. ఆయన ఏ పాత్రనైనా పోషించగలరు. నా పాత్రలో అలియా భట్‌ సహజంగా, క్యూట్‌గా ఉంటుంది' అని అన్నట్లు తెలుస్తోంది. జయప్రద ఓ పక్క రాజకీయ నాయకురాలిగా రాణిస్తూనే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'మహర్షి' సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'సువర్ణ సుందరి' చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. జయప్రద, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం 'కినార్‌' ఇటీవల విడుదలైంది.
Next Story
Share it