Top
Sneha TV

డీలా పడిపోయిన నాగ్....

X

కష్టానికి తగిన ఫలితం దక్కుకుంటే మిగిలేది నిరాశే. ఇప్పుడు స్టార్ హీరో నాగార్జునకి అదే మిగిలింది. నాగార్జున - రాఘవేంద్ర రావుల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ఫస్ట్ షోతోనే హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. భక్తుడిగా నాగ్ నటన మెగాస్టార్ చిరంజీవిలాంటోళ్లని కంటతడి పెట్టుకొనేలా చేసింది. ఇప్పుడు సినిమా ఫలితం నాగ్ ని ఏడిపిస్తున్నట్టు సమాచారమ్.

హిట్ టాక్ సొంతం చేసుకొన్న 'ఓం నమో వెంకటేశాయ' ప్లాప్ చిత్రంగా తేలింది. కలెక్షన్స్ చాలా పూర్ గా ఉన్నాయి. ఇక, ఓవర్సీస్ లో ఈ చిత్రం డిజాస్టర్ గా తేలింది. దీంతో.. హిట్ టాక్ తెచ్చుకొని ప్లాప్ సినిమాగా తేలిన లిస్టులో ఓం నమో వెంకటేశాయ చేరింది.

ఇది చిత్రబృందాన్ని బాధిస్తోంది. నాగార్జున అయితే డీలా పడినట్టు చెబుతున్నారు.

రెండు రోజులుగా నాగార్జున ఎవరి కాల్స్ తీసుకుకోవడం లేదట. ఇంట్లోంచి ఎటూ వెళ్లడం లేదని సమాచారమ్. ఇంట్లోనూ ఎవరినీ కలవట్లేదట. 'ఓం నమో వేంకటేశాయ' ఫలితం నాగ్ ని మానసికంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. కెరీర్ లో ఎన్నో హిట్లు, ప్లాపులు చూసిన అనుభవం నాగ్ ది. అలాంటి నాగ్ డీలా పడిపోవడం చిత్రమసీమని కూడా బాధిస్తోంది.

Next Story
Share it