Top
Sneha TV

దువ్వాడ.. దున్నేస్తున్నాడు... !

X

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. హరీష్ శంకర్ దర్శకుడు. 'డీజే' డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఇందులోద్విపాత్రాభినయం చేస్తుండటం.. అందులో ఓ పాత్ర బ్రాహ్మాణ యువకుడిగా కనిపించబోతుండటం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలకి తగ్గట్టుగానే 'డీజే'ని రూపుద్దిదుకొంటున్నట్టు తెలుస్తోంది.

అయితే, రిలీజ్ కి ముందే దువ్వాడ.. దున్నేయడానికి రెడీ అయ్యాడు. ఫిబ్రవరి 18న డీజే ఫస్ట్ లుక్, మహాశివరాత్రి కానుకగా ఈ నెల 24న టీజర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తాజాగా, డీజే ప్రీ-లుక్ ని వదిలింది చిత్రబృందం. ప్రీ-లుక్ ఆసక్తికరంగా ఉంది.

ఫస్ట్ లుక్, టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగేలా చిత్రబృందం ప్లాన్ చేసింది.

అందుకే అతి తక్కువ గ్యాప్ లో ఫస్ట్ లుక్, టీజర్ ని వదులుతున్నారు. టీజర్ రిలీజ్ తర్వాత అబుదాబిలో షెడ్యూల్ కోసం అక్కడికి వెళ్లనుంది చిత్రబృందం.

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు హ్యాట్రిక్ హిట్స్ తో ఊపుమీదున్నాడు బన్ని. ఇదే ఊపులో డీజే తో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయాలని ఆశపడుతున్నాడు.

ఈ చిత్రంలో బన్ని సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత.

Next Story
Share it