Top
Sneha TV

పవన్ కోసం సూపర్ స్టార్ ఓకే చెప్పాడు....

X

పవర్ స్టార్ సినిమాకి సూపర్ స్టార్ ఓకే చెప్పేశాడు. 'కాటమరాయుడు' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకొన్న.. ఈ చిత్రం మార్చి 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

గతంలో 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రని తీసుకొన్నాడు త్రివిక్రమ్. ఆ పాత్ర బాగా పడింది. ఇప్పుడు పవన్ సినిమా కోసం మరోసారి ఉపేంద్రని తీసుకోవాలి త్రివిక్రమ్ భావించాడు. చివరికి ఆ పాత్ర కోసం ఉపేంద్రకి బదులుగా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాడు.

తాజా సమాచారమ్ ప్రకారం మోహన్ లాల్ కి త్రివిక్రమ్ కథ వినిపించాడట.

కథ బాగా నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా అంటేనే మాటలు బుల్లెట్ లా పేలుతాయి. ఇప్పుడు మోహన్ లాల్ పాత్ర కోసం కూడా బుల్లెట్ లాంటి మాటలు రాశాడట.

టాలీవుడ్ లో మోహన్ లాల్ కి మార్కెట్ పెరిగింది. ఈ నేపథ్యంలో.. పవర్ స్టార్, సూపర్ స్టార్ కలసి నటిస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు.

Next Story
Share it