Top
Sneha TV

కమల్‌ నన్ను మేకప్‌ తీసేయమన్నారు

X
కమల్‌ నన్ను మేకప్‌ తీసేయమన్నారు ఆయనే నాలో మార్పు తెచ్చారు: రాణీ ముఖర్జీ ముంబయి: ఓ నటిగా తనలో మార్పు రావడానికి విశ్వనటుడు కమల్‌ హాసనే కారణం అని అంటున్నారు బాలీవుడ్‌ నటి రాణీ ముఖర్జీ. ఇటీవల ఆస్ట్రేలియాలో ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు రాణీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'హిచ్కీ' సినిమాకు గానూ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాణి తన కెరీర్‌ గురించి ప్రస్తావించారు. 'నా సినీ కెరీర్‌లో కమల్‌ హాసన్‌తో కలిసి నటించిన 'హే రామ్' సినిమా టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. చిత్రీకరణలో భాగంగా ఓసారి సెట్‌కు వెళ్లాను. అప్పుడు కమల్‌ నన్ను చూసి మేకప్‌ తీసేయాలని చెప్పారు. అప్పుడు నేను ముఖం కడుక్కుని ఓ క్రీం రాసుకుని వెళ్లాను. అది చూసి ముఖం మొత్తం కడుక్కుని రమ్మన్నారు.

నేను ఆయన చెప్పినట్లుగానే చేశాను. సెట్‌లో నేను మేకప్‌ లేకుండా ఉండడం అదే మొదటిసారి. కానీ చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది. ఆ తర్వాత చిత్రీకరణలో భాగంగా మళ్లీ మేకప్‌ వేసేవారు.

కానీ కమల్‌ హాసన్‌ నాలో ఎంతో మార్పును తెచ్చారు. నాకు తెలిసినంతవరకు ఓ ఆర్టిస్ట్‌ అందం, జుట్టు, బరువు గురించి పట్టించుకోకూడదు. వారి లక్ష్యం నటనపైనే ఉండాలి. అప్పుడే మనలోని నటనా నైపుణ్యాలు బయటికి వస్తాయి' అని వెల్లడించారు రాణి.
Next Story
Share it