Top
Sneha TV

'మహర్షి' సెట్‌లో విజయ్ సందడి

X
'మహర్షి' సెట్‌లో విజయ్ సందడి హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం రాత్రి యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ సరదాగా 'మహర్షి' సెట్‌కు వెళ్లి సందడి చేశారు. ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 'మహేశ్‌ సర్‌..వంశీ అన్న..మహర్షి సెట్‌కు వెళ్లాను. మహేశ్‌ సర్‌ సినిమా విడుదలైతే టికెట్ల కోసం కొట్టుకునే రోజుల నుంచి ఆయనతోనే కలిసి సెట్‌లో ఎంజాయ్‌ చేసే రోజు వచ్చింది. ఫుల్‌ లవ్' అంటూ విజయ్‌ వారితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 'మహర్షి' చిత్రంలో మహేశ్‌ రిషిగా కొత్త లుక్‌లో కన్పించబోతున్నారు. ఇందులో అల్లరి నరేశ్‌.. రవిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

2019 ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క విజయ్‌ 'గీత గోవిందం' సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించారు. ప్రస్తుతం ఆయన 'ట్యాక్సీవాలా', 'నోటా' చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Next Story
Share it