Top
Sneha TV

కళ్యాన్ బాబాయ్ 'సైరా'సూపర్ అన్నారు : రాంచరణ్

X

మెగాస్టార్ చిరంజీవి మాస్ ఎలిమెంట్స్ తో పాటు రైతులకు మెసేజ్ ఇస్తూ..వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150'సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక చిరంజీవి 151 వ సినిమా 'సైరా నరసింహారెడ్డి'మరో అద్భుతమైన విజయానికి వేధిక కాబోతుందా..అంటే అవుననే అంటున్నారు. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు..అయితే నిన్న చిరు నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినినిమా టీజర్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డులు క్రియేట్ చేయడం మొదలు పెట్టింది..ఐదు గంటల్లో ఐదు లక్షల వ్యూస్ రావడంతో టీజర్ రేంజ్ ఏంటో తెలిసింది.

అద్భుతమైన విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్ తో ఉన్న ఈ టీజర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్ లో ఉంటే... సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు పెరిగిపోయాయి. ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ..ఈ సినిమా కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే..నా సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయని..అయితే సైరాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసే రోజు ఫైనల్ ఔట్ పుట్ తనకు ఉదయం 10.45 గంటలకు వచ్చిందని, వెంటనే దాన్ని తాను బాబాయ్ కి ఫార్వర్డ్ చేశానని చెప్పాడు.

అది చూసిన బాబాయ్ నాకు 11.10 నిమిషాలకు రిప్లై ఇచ్చారు..'టీజర్ అదిరిపోయింది... థియేటర్ లో చూసేందుకు రెడీ అవుతున్నాను' అని బాబాయ్ చెప్పారని చరణ్ తెలిపాడు. ఆ ఒక్క మాటతో టీజర్ రేంజ్ ఏంటో అర్ధం అయ్యింది..అందుకే అభిమానుల నుంచి అంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని అన్నారు.

Next Story
Share it