Top
Sneha TV

టీజర్ టాక్ : సైరా - రికార్డులు బద్దలే

X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' . సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా నిర్మించబడుతోంది. రాంచరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా , బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేదీ సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమాలో పలు కీలకపాత్రల్లో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యం లో రేపు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఓ రోజు ముందుగానే మెగా అభిమానులకు మెగా గిఫ్ట్ ఇచ్చారు సైరా యూనిట్. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు..ఈ ఒక్క టీజర్ చాలు ఇండస్ట్రీ రికార్డు బద్దలు కావడానికి..మెగా స్టార్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడబోతాడని చెప్పవచ్చు..సినిమా ఫొటోగ్రఫీ , సినిమా సెట్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , నటీనటుల పెర్ఫార్మన్స్ , రాంచరణ్ నిర్మాణ విలువలు ఇవన్నీకూడా సినిమా స్థాయి పెంచేలా కనిపిస్తున్నాయి.

మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వేసి ఎంజాయ్ చెయ్యండి.

Next Story
Share it