Top
Sneha TV

తెరపైకి శ్రీరెడ్డి బయోపిక్..

X

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ ల హావ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరెడ్డి జీవిత కథఫై రెడ్డి డైరీ పేరుతో సినిమా తెరకెక్కబోతున్నట్లు ప్రకటించారు. కాస్టింగ్ కౌచ్ పేరిట తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలను షేక్ చేసిన శ్రీరెడ్డి జీవితంలో ఎదురుకున్న కష్టాలను సినిమా రూపంలో చూపించబోతున్నారట.

శ్రీరెడ్డి స్వీయ చరిత్రను రెడ్డి డైరీ పేరుతో సినిమా చేయనున్నట్లుగా చెన్నై ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్ మాట్లాడుతూ.. శ్రీరెడ్డి జీవితంలో చోటు చేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా రెడ్డి డైరీని రూపొందిస్తామని చెప్పారు.

శ్రీరెడ్డి మాట్లాడుతూ.. తనను మోసగించిన వారి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని చెప్పారు. తాను నటించబోయే రెడ్డి డైరీ చిత్రానికి సహకరిస్తామని నడిగర్ సంఘం హామీ ఇచ్చిందన్నారు. క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వీడియో ఆధారాలన్ని తన దగ్గర ఉన్నాయని.. రెడ్డిడైరీ మూవీతో వాటిని విడుదల చేస్తానంటూ మరో బాంబు పేల్చి మరోసారి కొంతమందికి నిద్ర లేకుండా చేసింది. మరి ఈ బయోపిక్ ఎలా ఉండబోతుంది..? ఎవరెవరి బండారం బయటపెడతారు..? ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తారు.? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది..? అనేది చూడాలి.
Next Story
Share it