Top
Sneha TV

ఇండస్ట్రీ కి రూ. 40 తో వచ్చి ఇప్పుడు రూ. 40 కోట్లు వెనకేసుకున్నాడు..

X

సినిమా ఇండస్ట్రీ అందరికి కలిసిరాదు.కొంతమంది ఇక్కడ ఎంతో సంపాదిస్తే..కొంతమంది అన్ని పోగొట్టుకుంటారు..అలాంటిది ఇండస్ట్రీ కి 40 రూపాయలతో వచ్చి ఇప్పుడు రూ. 40 కోట్లను తన ఖాతాలో వేసుకున్న వ్యక్తి గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని అనుకుంటున్నారా ఆయనే బన్నీ వాసు. తాజాగా ఈయన నిర్మించిన గీత గోవిందం రూ. 14 కోట్లతో నిర్మించబడి , కేవలం వారం రోజుల్లో దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి అందరికి లాభాల పంట పండించింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో బన్నీ వాసు గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి.


పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ మీట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో చిరు సమక్షం లో చాల గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అతిరధ మహారధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఆర్య తీసిన టైంలో వాస్ పాలకొల్లు సెంటర్ రైట్స్ కావాలని వచ్చాడని, ఒక్కటే ఎందుకు మొత్తం వెస్ట్ గోదావరి తీసుకోమని ప్రోత్సహిస్తే తన దగ్గర జేబులో ఉన్న 40 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి ఇప్పుడు తన స్థాయికి చేరుకున్నాడని , తన సినిమాకే పోటీగా వెళ్లి గెలిచే రేంజ్ కు చేరుకున్నాడని రాజు చెప్పుకొచ్చాడు.
Next Story
Share it