Top
Sneha TV

'ఫ్రైడే 'మూవీ ప్రారంభం

X

'ఫ్రైడే 'మూవీ ప్రారంభం

శ్రీ మీనాక్షి మూవీస్‌ పతాకంపై కెఎస్‌ఆర్‌ డాన్స్‌ అకాడమీ సమర్పణలో నిర్మాత కె.సత్యరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఫ్రైడే.. కిషన్‌ కెకె హీరోగా పరిచయం అవుతున్న ఈచిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది.. తెలంగాణ మంత్రి హరీష్‌రావు తొలిసన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు.. సి. కళ్యాణ్‌ గౌరవ దర్శకత్వం వహించారు.. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కెమెరా స్విచ్చాన్‌ చేశారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు..
అనంతంర చిత్ర దర్శకుడు దాసరి లారెన్స్‌ మాట్లాడారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌స్టోరీతో చిత్రం ఉంటుందన్నారు. హీరో పోలీస్‌ు ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారని తెలిపారు. మంచి కథతో ముందుకు వస్తున్నామన్నారు . హీరో కిషన్‌ మాట్లాడుతూ, ఈచిత్రానికి ప్రొడ్యూసర్‌ సత్యారెడ్డిగారే స్క్రిప్టు అందించారన్నారు..

దాదాపు ఏడాదిపాటు స్క్రిప్టుపై కష్టపడి పనిచేశారన్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, బేబీ మీనాక్షి ఇందులో లీడ్‌రోల్‌ చేస్తుందన్నారు. కార్యక్రమంలో నిర్మాత సత్యరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్‌ సెప్టెంబర్‌ 5నుంచి మొదలుపెట్టనున్నామని తెలిపారు. కొత్త కథ అందులో క్రైమ్‌ జోనర్‌లో చాలా బాగావచ్చిందన్నారు.

అందరికీ నచ్చుతుందన్నారు. కార్యక్రమంలో హీరోయిన్లు కశ్మీర, సుమన పూజారి తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it