Top
Sneha TV

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చిన నూతన్..

X

వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు రాత్రి జరిగిన టాస్క్ లో భుజం గాయం తో ఇంటి నుండి బయటకొచ్చారు. ఈ వారం కెప్టెన్ పోటీ లో భాగంగా కౌశల్ , రోల్ రైడా ల మధ్య 'పడగొట్టు.. నిలబెట్టు'.. అనే చాలెంజింగ్ టాస్క్‌ జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా నూతన్ , కౌశల్ కు సపోర్ట్ గా నిలిచారు. కాగా ఈ టాస్క్ ఆడుతున్న సమయం లో నూతన్ గాయపడ్డాడు. దీంతో వెంటనే అతన్ని ఇంటి సభ్యులు కన్ఫెషన్ రూంకి తీసుకెళ్ళారు.

కన్ఫెషన్ రూంలోకి వచ్చిన డాక్టర్.. నూతన్ నాయడు భుజాన్ని పరీక్షించగా, పెద్ద గాయం అని తెలుసుకొని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని చెప్పారు. దీంతో ఇంటి సభ్యులు అందరికి విషయాన్ని తెలియజేస్తూ నూతన్ నాయుడు లగేజ్‌ని స్టోర్ రూంలో పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఇక నూతన్ నాయుడుని హాస్పిటల్‌కి తరలించారు. దీన్ని బట్టి చూస్తే ఇక బిగ్ బాస్ హౌస్ లో నూతన్ వచ్చే ఛాన్స్ లేనట్లే. ప్రేక్షకుల సపోర్ట్‌తో ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈయన తనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి , అతి తక్కువ టైంలోనే గాయాల పాలవ్వడం ప్రేక్షకులను బాధ కలిగిస్తుంది.

Next Story
Share it