Top
Sneha TV

ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తారా?

X

నటించాలన్న తపనుండి అవకాశాలకోసం ఎదురుచూస్తున్నవాళ్లకో గుడ్ న్యూస్. ఎన్‌బీకే ఫిల్మ్స్‌ మీకా అవకాశం కల్పిస్తోంది. అదీ ఆషామాషీ సినిమా కోసం కాదు, ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే ఛాన్స్. "నటిస్తూ తెరమీద కనబడుతూ జీవించాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ మంచి అవకాశాలు రానివారు కొందరు.. అలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం" అంటూ ఎన్‌బీకే ఓ ప్రకటన చేసింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు రెండు ఫొటోలు పంపాలని, అలాగే స్మార్ట్‌ఫోన్‌లో తమ నటన ఏపాటిదో చూపెడుతూ 30 సెకన్లకు మించకుడా ఓ వీడియో తీసి casting.ntrbiopic@gmail.com కి మెయిల్‌ చేయాలని కోరారు. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌గా, క్రిష్‌ డైరెక్షన్లో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే.

Next Story
Share it