Top
Sneha TV

'ఆషికీ 3' హీరో దొరికాడు ...

X

బాలీవుడ్ లో విజయవంతమైన సిరీస్'లలో 'ఆషికీ' ఒకటి. ఈ సిరీస్ లో ఆషికీ, ఆషికీ 2 ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద విజయాన్ని అందుకొన్నాయి. ఇప్పుడు ఆషికీ 3 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మూడో భాగానికి హీరో ఎవరన్న దానిపై కొద్దిరోజులుగా బాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ఇప్పుడు ఆషికీ 3 హీరో బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్ సిద్ధార్థ్‌ మల్హోత్రా అని తేలిపోయింది. ఇప్పటికే నిర్మాత మహేష్‌ భట్‌ 'ఆషికీ 3'కి సంబంధించి సిద్ధార్థ్‌ తో చర్చలు జరిపినట్టు సమాచారమ్. మోహిత్‌ సూరి దర్శకత్వంలో 'ఆషికీ 2' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు 'ఆషికీ 3' కి కూడా అతడే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.

Next Story
Share it