Top
Sneha TV

'సైరా'పై ఎన్ని రూమర్లో...

X

రంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్‌కి ముందు నుంచే వార్తల్లో నిలిచింది. ఓ చరిత్రకారుడి కథని చిరు ఎంచుకోవడం, ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుండడంతో 'సైరా'కి ప్రచారం ఉదృతంగా లభించింది. అయితే అనూహ్య పరిణామాల వల్ల సాంకేతిక నిపుణుల్లో మార్పులు జరిగాయి. రెహమాన్‌ ఈ టీమ్‌ నుంచి బయటకు వెళ్లిపోవడంతో సంగీత దర్శకుడి విషయంలో సందిగ్థత నెలకొంది. రెహమాన్‌ స్థానంలో తమన్‌ని తీసుకోవచ్చని వార్తలు వినిపించాయి. అయితే అదీ ఓ కొలిక్కిరాలేదు. ఇప్పుడు కీరవాణి పేరు వినిపిస్తోంది. మరోవైపు ఈ టీమ్‌ నుంచి నయనతార కూడా వెళ్లిపోయిందని, ఆమె స్థానంలో మరో కథానాయికని తీసుకుంటారని చెప్పుకుంటున్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డినీ మార్చేస్తారని, వినాయక్‌ ఈ ప్రాజెక్టులోకి వస్తారని గుసగుసలు వినిపించాయి. అయితే.. ఇవన్నీ కేవలం రూమర్లుగా చిత్రబృందం కొట్టిపారేస్తోంది. 'ఈ వార్తల్లో నిజం లేదు.

టీమ్‌లోంచి ఎవ్వరూ బయటకు వెళ్లడం లేదు' అని 'సైరా' సన్నిహిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో తొలి షెడ్యూలు ముగించుకుంది 'సైరా'. ఫిబ్రవరిలో రెండో షెడ్యూలుకి శ్రీకారం చుడతారు.

Next Story
Share it