Top
Sneha TV

అనుష్క తర్వాత 'బికినీ' పూజకే సెట్ అయ్యింది!

X

అన్ని కాస్ట్యూమ్స్ అందరికీ సూట్ అవ్వవు. ముఖ్యంగా హీరోయిన్ల కాస్ట్యూమ్స్ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి సుమీ! ఇటీవల బన్నీ చెప్పినట్లుగా ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది, దానికి తగ్గట్లే కాస్ట్యూమ్స్ కూడా సూట్ అవుతాయని చెప్పాలి. తాజాగా విడుదలైన "దువ్వాడ జగన్నాధమ్"లో హీరోయిన్ పూజా హెగ్డే లుక్స్, కాస్ట్యూమ్స్ సినిమాకు చాలా దోహదపడ్డాయనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో పూజ ధరించిన బికినీ సీన్ ఫస్టాఫ్ కే హైలైట్ గా నిలిచింది.

ఇటీవల కాలంలో ప్రధాన హీరోయిన్లు బికినీ ధరించే సన్నివేశాలు చాలా తక్కువైపోయాయి. గతంలో రమ్యకృష్ణ, రంభ వంటి తెలుగు హీరోయిన్లు దాదాపుగా ప్రతి సినిమాలోనూ బికినీలో కన్నులవిందు చేసేవారు. అయితే వర్తమాన తారామణులకు బికినీ అంతగా సూట్ కాకపోవడమనేది ఓ కారణంగా చెప్పాలి. అయితే 'డీజే'లో మాత్రం పూజా హెగ్డే బికినీ సీన్ యువ హృదయాలలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. 'బిల్లా' సినిమాలో అనుష్క బికినీ తర్వాత ఆ రేంజ్ లో ఒక్క పూజకే సెట్ అయ్యిందని చెప్పాలి.

పొడుగు కాళ్ళతో స్విమ్మింగ్ పూల్ నుండి బికినీతో కనిపించిన పూజ లుక్స్ చూసి అల్లు అర్జున్ కూడా తడబడిపోయాడు. ఇక సామాన్య ప్రేక్షకుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఒక్క బికినీయే కాదు, మొత్తంగా ఈ సినిమాలో ధరించిన కాస్ట్యూమ్స్ అన్ని కూడా పూజాకు బాగా సెట్ అయ్యాయి. కాస్ట్యూమ్స్ కు తోడు పూజ ఫేస్ లో ఉన్న ఫ్రెష్ నెస్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఫస్టాఫ్ వరకు పూజతో పర్వాలేదనిపించాడు 'డీజే.'

Next Story
Share it