Top
Sneha TV

ఈ రోజు ఫాన్స్ కి పండగే....

X

మెగాస్టార్ బుల్లితెర ఎంట్రీ అదిరిపోయింది. విజయవంతంగా మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోపై ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. స్టార్ మా కొత్తగా నామకరణం చేసుకున్నాక వచ్చిన మొదటి ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవ్వడం పట్ల యూనిట్ కూడా ఆనందంగా ఉంది. నాగార్జున బాగా చేసాడా చిరు బాగా చేస్తున్నాడా అనే పోలిక అనవసరం అని కొట్టి పడేస్తున్నారు ఫాన్స్. ఇద్దరిది ఎవరికి వాళ్ళది ప్రత్యేకమైన శైలి అని తాము ఇక్కడ స్టార్స్ అనే ప్రూవ్ చేసిన వాళ్ళ కమిట్మెంట్ కి జోహార్ అనాల్సిందే అని అంటున్నారు. ఇక చిరు రోజు గంటన్నర పాటు టీవీపై దర్శనం ఇస్తుండటంతో ఫాన్స్ కైతే ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

తనదైన శైలిలో చిరు ప్రోగ్రాంని బాగా రక్తి కట్టిస్తున్నారు కూడా. ఈ వీక్ ఎండ్ లో రాబోయే టిఆర్పి రేటింగ్స్ మీదే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. స్టార్ మా ఒక బ్రాండ్ గా అవతరించడానికి ఈ ప్రోగ్రాంనే ప్లాట్ ఫార్మ్ గా వాడుకోవాలని డిసైడ్ అయ్యింది. నాలుగు నెలల పాటు ప్రసారం కానున్న ఈ షోకి సంబందించిన మొత్తం ఎపిసోడ్స్ మార్చ్ కంతా పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత తన 151 మూవీ షూటింగ్ లో బిజీ కానున్నారు మెగాస్టార్.

ఇక ఈ రోజు టెలికాస్ట్ కాబోయే స్పెషల్ ఎపిసోడ్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. రెండు సీజన్లను విజయవంతంగా నడిపించి షోని ఓ లెవెల్ కి తీసుకెళ్ళిన మాజీ యాంకర్ అక్కినేని నాగార్జున ఈ సారి గెస్ట్ గా రానున్నాడు. దాన్ని ఈ రోజు ప్రసారం చేయబోతున్నారు. వ్యక్తిగతంగా మంచి స్నేహితులు ఐన చిరు నాగ్ కలిసి ఎలాంటి సందడి చేయబోతున్నారు అని సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. మొన్నటి నుంచి చూపిస్తున్న ప్రోమోస్ దానికి అనుగుణంగా మాంచి ఆసక్తి రేపెలా ఉన్నాయి. ఈ మూడు రోజుల కన్నా మిన్నగా రేటింగ్స్ వస్తాయి అనటం సందేహం అక్కర్లేదు. ఈ వారానికి ఇదే చివరి ఎపిసోడ్. మళ్ళి సోమవారం దర్శనం ఉంటుంది కాబట్టి వీక్ ఎండ్ ఎపిసోడ్ ఇలా ప్లాన్ చేసార. షోకి సంబంధించి ఇద్దరి మధ్య చాలా ఆసక్తికరమైన విషయాలు డిస్కషన్ లో వచ్చాయని తెలుస్తోంది. ఈ షోలో రేపు నాగార్జునతో పాటు బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా పాల్గొంటోంది. సో.. గ్లామర్ కూడా తోడయ్యింది. 'ఓం నమో వేంకటేశాయ' ప్రమోషన్ కి కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నాగ్ ఇలా ప్లాన్ చేసుకున్నాడు అన్న మాట.. గుడ్.

Next Story
Share it